రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐ.ఏ.ఎస్. కలిసి 13 ప్రధాన ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల భవనాలకు స్థలాల కేటాయింపు, రైతుల భూ సమస్యలు, పట్టాదార్ పాస్బుక్ల జారీ, నకిలీ విత్తనాల నియంత్రణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, పేదలకు ఇంటి స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైతులకు మొక్కజొన్న, జొన్న కొనుగోలు పరిమితుల పెంపు, ఖాళీ రేషన్ షాప్ డీలర్ పోస్టుల భర్తీ, కొత్త మీ-సేవ కేంద్రాల ఏర్పాటు సహా మొత్తం 13 అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.