పెళ్లి పత్రికలు పంచేందుకు వచ్చిన యువతి హత్య.. గాంధారిలో కలకలం!
- భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం - November 8, 2026
- పెళ్లి పత్రికలు పంచేందుకు వచ్చిన యువతి హత్య.. గాంధారిలో కలకలం! - November 8, 2026
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
గాంధారి: వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి దారుణ హత్యకు గురైంది. పెళ్లి పత్రికలు అందించేందుకు సొంతూరుకు వచ్చిన ఆర్సీ కౌర్ అనే యువతి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురికావడం గాంధారి మండలంలో కలకలం రేపింది. హైదరాబాద్‌లో నివాసముంటూ జీవనోపాధి పొందుతున్న ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శుక్రవారం స్వగ్రామమైన గాంధారికి వచ్చింది. రాత్రి సమయంలో అంగడి బజార్ సెల్ టవర్ సమీపంలో ఆమె హత్యకు గురైనట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
