జ్యోతినగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్న యువత

1000202336.jpgజ్యోతినగర్‌లోని సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటూ జై బోలో గణేశ్ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. యువత ఉత్సాహంతో కార్యక్రమం సందడిగా సాగింది. నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.

You may also like...