స్థానిక ఆటో యూనియన్లతో ఇబ్బందులు సీఐకి వినతిపత్రం
- రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి - September 25, 2026
- అనుమతులు లేని వైద్య కేంద్రాలపై అధికారుల కొరడా - September 25, 2026
- 22వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం – హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు - September 25, 2026

జనగామ పట్టణంలో రాపిడో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాపిడో ఆటో డ్రైవర్లు గురువారం జనగామ సీఐ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌తో పాటు స్థానిక ఆటో స్టాండ్ల వద్ద రాపిడో ద్వారా ప్రయాణికులను తీసుకెళ్లే సమయంలో స్థానిక ఆటో యూనియన్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.రాపిడో ఆటోలను అడ్డుకోవడం,ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమ ఉపాధికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాపిడో, స్థానిక ఆటో డ్రైవర్ల మధ్య నెలకొన్న సమస్యలను పోలీసులు జోక్యం చేసుకుని సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా అన్ని వర్గాల ఆటో డ్రైవర్లకు సమానంగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సులేమాన్, దస్తగిరి, జలీల్, విజయ్, అస్లాం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
