హైదరాబాద్‌లో నేటి నుంచి రోడ్ల సదస్సు
- 26 నుంచి చీరలు, పింఛన్ల పంపిణీ! - November 19, 2026
- 26న పింఛన్ల జాతర! - November 19, 2026
- ఆయిల్‌పామ్‌లో తెలంగాణ అగ్రస్థానం! - November 19, 2026

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్:
హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ముఖ్యఅతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 3,500 మంది రహదారుల రంగ నిపుణులు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో పర్యావరణహిత రహదారుల నిర్మాణం, ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ వ్యవస్థల వినియోగం, రహదారుల నాణ్యత, భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు.
