మరో 7 జిల్లాల్లో అంగన్వాడీ బ్రేక్‌ఫాస్ట్
- 26 నుంచి చీరలు, పింఛన్ల పంపిణీ! - November 19, 2026
- 26న పింఛన్ల జాతర! - November 19, 2026
- ఆయిల్‌పామ్‌లో తెలంగాణ అగ్రస్థానం! - November 19, 2026

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్:
రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ‘తొలిముద్ద’ అల్పాహార పథకాన్ని ప్రభుత్వం మరో 7 జిల్లాలకు విస్తరిస్తోంది. ఇందిరమ్మ జయంతి సందర్భంగా నేటి నుంచి భూపాలపల్లి, జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. దీంతో అదనంగా 43,657 మంది చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టిక అల్పాహారం అందనుంది. ఇప్పటికే 7 జిల్లాల్లోని 8,694 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 91,796 మంది చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
