లంచం వలలో టోలిచౌకి సీఐ.




జ్ఞాన తెలంగాణ, స్టేట్ డెస్క్ :

పోలీసు శాఖలో అవినీతి వ్యవహారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. లంచం తీసుకుంటున్న సమయంలో టోలిచౌకి సీఐ రమేష్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కలిగిన పోలీసు అధికారులే లంచాల వ్యవహారాల్లో చిక్కుకోవడం పోలీసు వ్యవస్థలో అవినీతి నిర్మూలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు, విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులో లంచం మొత్తంతో పాటు, ఏ పని నిమిత్తం డబ్బులు డిమాండ్ చేశారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత వెల్లడికానున్నాయి.

You may also like...