రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య
- సోనియాకు కోర్టు ఝలక్! - September 21, 2026
- ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు ఘన సత్కారం - September 21, 2026
- రక్షణ లేని ఆర్టీసీ బస్‌స్టేషన్.. దొంగలకు అడ్డాగా వికారాబాద్ బస్టాండ్ - September 21, 2026

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ పర్యటనలో పలు అభివృద్ధి నమూనాలు, ఆధునిక మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించిన కాలే యాదయ్య, వాటిలో ఉపయోగకరమైన అంశాలను నియోజకవర్గ అభివృద్ధిలో అమలు చేయడంపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్వదేశానికి తిరిగి వస్తుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
