ఎల్ఐసీ వాటాల విక్రయంపై గోప్యత.. పారదర్శకతపై ప్రశ్నల
- ఫతేపూర్‌లో బోనాల జాతర వేళ ఘర్షణ.. 15 మందిపై బైండోవర్ - August 7, 2026
- చేనేత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - August 7, 2026
- తెలంగాణ ప్రాజెక్టులపై సమీక్ష ఎజెండా ఉపసంహరించాలి : హరీశ్‌రావు - August 7, 2026

కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 6.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించి రూ.31,552 కోట్లు సమీకరించింది. అయితే ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధర కంటే సుమారు 11 శాతం తక్కువకు ఒక్కో షేరును రూ.382కు విక్రయించడం, నిర్ణయాన్ని చివరి నిమిషం వరకు అత్యంత గోప్యంగా ఉంచడం ఆర్థిక వర్గాల్లో అనుమానాలకు దారితీసింది.
మొదట 2.5 శాతం వాటాల విక్రయానికి ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన రావడంతో గ్రీన్‌షూ ఆప్షన్ ద్వారా మరో 4 శాతం వాటాలను విక్రయించి మొత్తం 6.5 శాతానికి పెంచింది. దీంతో ప్రభుత్వ వాటా 96.5 శాతం నుంచి 90 శాతానికి తగ్గింది. సెబీ నిబంధనల మేరకు పబ్లిక్ షేర్‌హోల్డింగ్ పెంపు కోసమే ఈ చర్య అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రయివేటు పెట్టుబడిదారులకు అధిక ప్రయోజనం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మూడు రోజుల పాటు సాగిన ఈ OFSకు 1.38 రెట్లు స్పందన లభించింది. భవిష్యత్తులో కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలను చేరుకునేందుకు మరో 15 శాతం వరకు వాటాలను దశలవారీగా విక్రయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో కోట్లాది పాలసీదారుల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఎల్ఐసీ భవిష్యత్తు, డిజిన్వెస్ట్‌మెంట్ విధానంపై చర్చ మరింత వేడెక్కుతోంది.
