డీఈఎల్‌ఈడీ ఫలితాలు విడుదల
- గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు? - August 13, 2026
- వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు - August 13, 2026
- ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా? - August 13, 2026

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) మొదటి సంవత్సరం మే–2026 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఆగస్టు 13, 2026 నుంచి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది.
అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రోల్ నంబర్, పుట్టిన తేదీ (DD-MM-YYYY) నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ మెమోను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫలితాలపై ఏమైనా సందేహాలు లేదా మార్కులపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 21, 2026 చివరి తేదీగా ప్రకటించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డీఐఈటీలు, ప్రైవేట్ డీఈఎల్‌ఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ సమాచారాన్ని అభ్యర్థులకు చేరవేయాలని సూచించారు.
ఫలితాల కోసం http://www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
