నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు
ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడక
ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండి
శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే
ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారు
పూర్తి ఆధారాలు కూడా బయటపెడత: హరీష్ రావు
నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతుందని విమర్శించారు. శ్వేత పత్రంలో ప్రజలు ప్రగతి కోణం లేదుని ఆరోపించారు.
శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే ఉందనిహరీశ్రావు అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండని సూచించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు.
తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారనిమండిపడ్డారు. సీఎం పాత గురువు పాత శిష్యులు ఈ నివేదిక తయారు చేయించారని కావాలంటే వారి పేర్లుతో పాటు ఆధారాలు కూడా బయటపెడతని హరీశ్‌రావు తెలిపారు. అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని అన్నారు. అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిని నివేదికలో చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
