రిపోర్టర్, కామారెడ్డి | 9491912715
Latest posts by GADDAM RAVI
(see all) ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలు నూతన నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామ అధ్యక్షుడిగా ఆర్. బాబు, లింగంపేట్ మండలం లింగంపల్లి కూర్దు గ్రామానికి చెందిన కుమ్మరి రాజేందర్‌ను మండల జాయింట్ సెక్రటరీగా, ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మర్రి బాలయ్యను ఎల్లారెడ్డి మండల రైతు కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు భాగారెడ్డి, పోకల సాయిరాం నూతన నియామకాలను వెల్లడించారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతనంగా నియమితులైన నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా టీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు జైల్ సింగ్, నాగిరెడ్డిపేట్ మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహీమ్, మహిళా అధ్యక్షురాలు పద్మ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీను, సీనియర్ నాయకులు ప్రభాకర్, రఘు, జహీర్, ఏజాజ్, గోపాల్పేట్ అధ్యక్షుడు సిద్ధిరాములు, పద్మశాలి అధ్యక్షుడు ప్రవీణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే లింగంపేట్ మండలంలో జరిగిన కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రైతు కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ రాథోడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాగరి సాయిలు, గ్రామ అధ్యక్షుడు కుమ్మరి సంతోష్ కుమార్, కృష్ణ గౌడ్, మహిళా అధ్యక్షురాలు సావిత్రి, మండల కార్యదర్శి మహేందర్, స్వామి, పోతరాజు రాజలింగం, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంతోష్ కుమార్, బాబు, జగన్ రెడ్డి, గంగారం, సర్దార్, ప్రేమ్ సింగ్, మలయా, సంగయ్య, ఎండీ అమీర్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా నియమితులైన నాయకులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
