​ఝరాసంగం మండలంలో 586 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ ​జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ​ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మంజుల ​ఝరాసంగం తహసీల్దార్ భాస్కర్

జ్ఞానతెలంగాణఝరాసంగం నవంబర్ 17
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రం రైతు వేదిక వద్ద మంగళవారం చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
​ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 586 మంది నూతన లబ్ధిదారులకు జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, ఎంపీడీవో మంజుల, తహసీల్దార్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందజేశారు.
​ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
​నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...