రూ.10 కోట్లతో డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులకు శ్రీకారం

  • మేడ్చల్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తుముకుంట డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.5 కోట్లతో డ్రైనేజీ పనులు, దమ్మాయిగూడ ఆర్‌జేకే ప్రాంతంలో మరో రూ.5 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులకు ఆయన, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నక్క ప్రభాకర్ గౌడ్, పిసరి మహిపాల్ రెడ్డి, మహమ్మద్ ముజీబ్ రుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా యాదవ్, నక్క సందీప్ గౌడ్, ముప్పు రామారావు, ఈగ శ్వేత, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...