జఫర్‌ఘడ్‌లో బాలల ప్రత్యేక గ్రామసభ
- ఐక్యంగా ఉద్యమించాలి: జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్ నియామకం - November 14, 2026
- బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన - November 14, 2026
- ఘనంగా రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు - November 14, 2026

జఫర్‌ఘడ్ లోబాలల ప్రత్యేక గ్రామసభలో భాగంగా దుర్బలతలు, ప్రాధాన్యతలు, కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప సర్పంచ్ కొత్వాల కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, బీసీ హాస్టళ్లు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో మొత్తం ఏడు అంగన్‌వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉండగా, మిగిలిన ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ముగ్గురు ఆయాలను నియమించాలని కోరారు.అదేవిధంగా ఉన్నత పాఠశాలలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో నూతనంగా నిర్మించాలని సమావేశంలో ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దినేష్, వార్డు సభ్యులు మొగిలిపాక సోమలక్ష్మి, ఉల్లి శ్రీలత, రోడ్డ రాధిక, కుక్కల రాజ్‌కుమార్, అంగన్‌వాడీ టీచర్లు, హాస్టల్ వార్డెన్ అనిత తదితరులు పాల్గొన్నారు.
