బొల్లంపల్లి కొత్తచెరువు కట్టకు బ్లాస్టింగ్ ముప్పు.! గ్రామస్తుల ఆందోళన.!

1001358071.jpg

వెల్దండ,నవంబర్ 13 :నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్తచెరువు పక్కనే ఉన్న క్రషర్ మిషన్, పొలం గట్టు గుట్టకు పెడుతున్న బ్లాస్టింగ్ కారణంగా చెరువు కట్టకు మరియు అలుగుకు ప్రమాదం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.బ్లాస్టింగ్ ధాటికి అలుగు ముందర భాగంలో కింద ఉన్న సిమెంట్ కాంక్రీట్ పెచ్చులు లేచిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.ఇదే విధంగా బ్లాస్టింగ్ కొనసాగితే చెరువు కట్టకు, అలుగుకే ప్రమాదం ఏర్పడి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పచ్చని ప్రకృతితో కలకలలాడే చెరువు పరిసరాలను, పంట పొలాలను ఈ బ్లాస్టింగ్ తో ఏర్పడే చిన్న చిన్న రాళ్లు, డస్ట్ బ్రష్టు పట్టిస్తున్నాయని పరిసర రైతులు, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రకృతి సంపదను కొల్లగొట్టి, గుట్టలను పిండి చేస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని గ్రామస్తులు అంటున్నారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి క్రషర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...