ఎర్రవల్లి బాధితులకు అండగా జేఏసీ – ఉల్పర్ నుండి కల్వకుర్తి దాకా మహా పాదయాత్రకు పిలుపు
- ఆమనగల్లులో వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - September 22, 2026
- త్రిదలన్ యూత్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్ - September 22, 2026
- చారగొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ - September 22, 2026
కల్వకుర్తి :
ఎర్రవల్లి భూ నిర్వాసితుల నిరవధిక దీక్షలు 295వ రోజుకు చేరాయి.దీక్షా శిబిరానికి సంఘీభావంగా ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు హాజరయ్యారు.ఈ నెల 27న ఉల్పర్ నుండి కల్వకుర్తి వరకు చేపట్టనున్న మహా పాదయాత్రకు సంబంధించి దీక్షా స్థలిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహా పాదయాత్రకు బాధితులుగా పెద్ద ఎత్తున తరలివస్తామని ఎర్రవల్లి భూ నిర్వాసితులు తెలిపారు.అనంతరం అజిలాపూర్ మరియు ఇర్విన్ గ్రామాల్లో కూడా మహా పాదయాత్ర సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాల్లో జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, రాఘవాచారి, ఖలీల్ తో పాటు ఎర్రవల్లి భూ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
