సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..!
- మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.! - November 12, 2026
- సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..! - November 12, 2026
- పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన మానవత్వం చాటిన కౌన్సిలర్ రామన్న .! - November 12, 2026

ఆమనగల్,నవంబర్ 12 :గ్రామాల ప్రథమ పౌరులైన సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని ఆమనగల్ మండల సర్పంచుల సంఘం కార్యదర్శి, పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య ప్రభుత్వానికి విన్నవించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామ ప్రజలు నేరుగా ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్. విద్యార్హతతో సంబంధం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన మాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ఎందుకు ఉండదు అని ప్రశ్నించారు.ఎంపీటీసీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఓటు వేసే అర్హత ఉన్నప్పుడు, సర్పంచులకు ఎందుకు లేదని అన్నారు.వారికి ఉన్నప్పుడు మాకు కూడా కచ్చితంగా ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఆలోచన చేసి సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలి.ఇది మా హక్కు,మా ఆత్మగౌరవం అని జంతుక వెంకటయ్య అన్నారు.సర్పంచులకు ఓటు హక్కు కల్పిస్తే గ్రామ పాలనకు మరింత గుర్తింపు వస్తుందని, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
