పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన
- పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన - October 1, 2026
- లూజు లైన్లకు చెక్.. లో వోల్టేజీకి పరిష్కారం.. - October 1, 2026
- పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి : తాసీల్దార్ పుష్పలత - September 30, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1 : మండల కేంద్రంలోని తాగునీటి సమస్య తలెత్తకుండా 11.12 వార్డుల్లో నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ పాలక వర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో దశల వారిగా నీటి సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో మోటర్ల సామర్ధ్యం కొంత మేర తగ్గిందని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, వార్డు సభ్యులు కానుగు శ్రీను, మైన ఉమా, ఏనుగు సైదులు, శ్రీరాం సంధ్య, అయితగోని సైదమ్మ, ఏకుల సుజాత, నాయకులు ఊట్కూరి శ్రీను, మాదగోని సురేందర్ గౌడ్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

