తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 2: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆశాడ మాస బోనాల పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శ్రీ కాలికా మాత అమ్మవారిని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

You may also like...