కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి ఘన సన్మానం

1001226761.jpg

కల్వకుర్తి :మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన సామ రామ్మోహన్ రెడ్డిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఎలిగొండ మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.హైదరాబాదులోని తన నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం పట్టభద్రుల ఎలక్షన్ మెంబర్ షిప్ గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల్లో రామ్మోహన్ రెడ్డి లాంటి వక్త ఉండటం నేటి సమాజానికి చాలా అవసరమని అన్నారు. పట్టబద్రులందరూ సమ రామ్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

You may also like...