నర్సుల కొరతతో వెల్దండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు
- అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బీజేవైఎం నాయకులు - November 2, 2026
- నర్సుల కొరతతో వెల్దండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు - November 2, 2026
- ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా హాజరు.. ఎమ్మెల్యే కసిరెడ్డి - November 2, 2026

వెల్దండ నవంబర్ 02 :వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోజుకు 120 మందికి పైగా రోగులు వస్తున్నప్పటికీ,ముగ్గురు నర్సులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తుండటంతో వైద్య సేవలపై పని భారం పెరుగుతోందని ఆసుపత్రి పర్యవేక్షకుడు మురళీకృష్ణ తెలిపారు.ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలకు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు. ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేసి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరుతున్నారు.
