చలో వెల్దండ ర్యాలీని విజయవంతం చేయాలి.. జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ
- అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేరు - October 1, 2026
- కల్వకుర్తిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమి పూజ - October 1, 2026
- మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత - October 1, 2026

వెల్దండ: ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించి, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. అక్టోబర్ 11న నిర్వహించనున్న ‘చలో వెల్దండ’ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్–టీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని మండల, తాలూకా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డాక్టర్ అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలని, జీవో నంబర్లు 58, 59 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న దళితులకు పట్టాలు ఇవ్వడంతో పాటు విక్రయ హక్కు కల్పించాలని కోరారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత విద్య అమలు చేయాలని, అర్హులైన దళిత కుటుంబాలకు మూడెకరాల సాగుభూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.గతంలో దళితుల నుంచి తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి ఇవ్వాలని, పారిశుద్ధ్య కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ.20 వేల వేతనం అందించాలని కోరారు. లీడ్‌క్యాప్‌ను పునరుద్ధరించి తోళ్ల పరిశ్రమలకు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించి, పరిశ్రమలు ఏర్పాటు చేసి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర బాలు, తాలూకా ఉపాధ్యక్షుడు దూల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి జంగయ్య, కార్యదర్శి ఈదులపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
