అసంపూర్తి గృహ నిర్మాణాలకు ఉప్పల వెంకటేష్ సిమెంట్ అందజేత

కల్వకుర్తి సెప్టెంబర్ 27: కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న 03 ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మూడు ఇండ్లు సంపంగి శివ,ఆఫీసు శ్రీను, గోరేటి చిన్న చెన్నయ్యలకు సిమెంటును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, బిఆర్ఎస్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ నాగయ్య, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మయ్య వార్డ్ మెంబర్ రాజేందర్ నాగేంద్రం , తుప్పల సత్యనారాయణ పోతనపల్లి కృష్ణయ్య మెంట బీరప్ప సాయి మొదలగువారు పాల్గొన్నారు.1001216704.jpg

You may also like...