నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
- నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- మృతురాలి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం - September 27, 2026
- కాటన్ మిల్లు కార్మికురాలి ఇంటి నిర్మాణానికి ఉప్పల వెంకటేష్ చేయూత - September 27, 2026
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 27:
ఏఐసీసీ పిలుపు మేరకు రేపు (సోమవారం, సెప్టెంబర్ 28) ఉదయం 10 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లు రవి, నాగర్కర్నూల్ జిల్లా ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి హాజరుకానున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
