రేపటి ధర్నా–ర్యాలీని విజయవంతం చేయాలి

జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ సభ్యులు, YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పిలుపు. ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 10:00 గంటలకు నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు టీపీసీసీ సభ్యులు, YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమం డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ గారి ఆధ్వర్యంలో, మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం చైర్మన్, భువనగిరి ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని, జనగామ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కడకంచి బాలమణి, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తాటికొండ వినయ్ తదితరుల నాయకత్వంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్యక్రమ వివరాలుతేదీ: సెప్టెంబర్ 28, 2026 సమయం: ఉదయం 10:00 గంటలకు ర్యాలీ:

నెహ్రూ పార్క్ కలెక్టరేట్ కార్యాలయo అనంతరం: కలెక్టరేట్ వద్ద ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ

జిల్లాలోని టీపీసీసీ కమిటీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, డీసీసీ కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, బ్లాక్, పట్టణ, మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, తాజా మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, PACS పాలకమండలి సభ్యులు, మార్కెట్ పాలకమండలి సభ్యులు, దిశ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనాలని డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ కోరారు.అలాగే మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఓబీసీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, NSUI, సోషల్ మీడియా విభాగం, వికలాంగుల వేదిక, వీవర్స్ సెల్ తదితర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై ధర్నా–ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పిలుపునిచ్చారుIMG-20260927-WA0553.jpg

IMG-20260927-WA0553.jpg

.

You may also like...