తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యం.. పోషకాహారమే శ్రీరామరక్ష!

బాన్సువాడ మండలంలోని సొమ్లా నాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప నేతృత్వంలో శనివారం పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ్ మాహ్‌లో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ రాథోడ్ స్వరూప మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

కార్యక్రమంలో సర్పంచ్ మీరిబాయి, ఆశా వర్కర్ పల్లవి, గ్రామ పెద్దలు చందర్ నాయక్, కారోబారి చందు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

You may also like...