హమార ప్రసాద్ ను చేయాలి – వెల్దండ ఎస్సై కి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 17:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని ఈనెల 18న ఆవిష్కరిస్తానని అమర ప్రసాద్ ప్రకటించడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైనటువంటి ఆరోపణలతో వస్తున్నటువంటి పుస్తక విడుదలను ఆపేసి వెంటనే అమర ప్రసాద్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.ప్రపంచం మొత్తమే గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అని కొనియాడుతున్న వేళ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదని హెచ్చరించారు.ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరిశఆధ్వర్యంలో వెల్దండ ఎస్ఐ యుగేంధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి తాలూకా అధ్యక్షులు తాండ్ర బాలు,తాలూకా ఇన్చార్జ్ కష్పాకుల రవికుమార్, తాలూకా ఉపాధ్యక్షులు దూళ్ళ రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి రామకృష్ణ, కార్యదర్శి ఈదులపల్లి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.1001186766.jpg

You may also like...