నిలిచిపోయిన డబల్ బెడ్ రూములకు మోక్షం కల్పించాలి సిపిఐ డిమాండ్
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

నిలిచిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ను నిర్మించి నిరుపేదలకు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి ఏ .విటల్ గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు, కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి ప్రజావాణిలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పంపిణీ చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు ,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విట్టల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో పాలిటెక్నికల్ కాలేజీ దగ్గర గత ప్రభుత్వంలో 2023 లో 6. 4 కోట్లతో 120 ఇల్లు నిర్మాణం చేపట్టారని ,ప్రస్తుతము ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగిందనీ, సదర్ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి నిధులు లేక మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని, దానివలన సోంతింటి కల నిరుపేదలకు లేకుండా పోయిందని , లక్షల ప్రజా ధనంతో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మధ్యలోనే వదిలేయడం వలన శిధిలావస్థకు చేరటంతో,పేద ప్రజల కిరాయి ఇళ్లల్లో నివసిస్తూ ఇబ్బందులకు గురి అవుతున్నారని, సొంత స్థలాలు లేక పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారని వారి కోసం అయినా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకొని నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి గ్రామంలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుందనీ, లేని ఏడల దశలవారీగా ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్లగంగాధర్ ,రవి, సాయిలు ,రాజయ్య తదితరులు పాల్గొన్నారు
