అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం తాత్కాలికంగా మార్చింది. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బూత్ లెవల్ అధికారులుగా (బీఎల్ఓలు) విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూన్ 29 నుంచి జూలై 28 వరకు నెల రోజుల పాటు కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహార పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. చిన్నారుల ప్రీ-స్కూల్ విద్యకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, బీఎల్ఓ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై అదనపు పనిభారం లేకుండా చూడాలని సూచించింది.
