మెరుగైన బోధనకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదం : పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 29: విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన బోధన అందించడంలో కాంప్లెక్స్ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇంగ్లీష్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివిధ పాఠశాలల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యతో పాటు విలువలను అందించాలని సూచించారు. పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ, గుణాత్మక విద్యా కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం 9వ, 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి తెలుగు, గణితం, సైన్స్ అంశాల్లో ప్రశ్నలు అడిగి వారి అభ్యసన స్థాయిని పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కట్టంగూర్ ఇన్ చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య, శాలిగౌరారం, నకిరేకల్, కేతేపల్లి మండలాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1000326718.jpg 1000326717.jpg

You may also like...