అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం
- చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లో రసాయన పౌడర్ - September 23, 2026
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026

అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు శంకర్‌పల్లి మునిసిపల్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలే యాదయ్య అమెరికా పర్యటనలో పలు అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడే అంశాలను పరిశీలించారని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణాన్ని మార్మోగించారు. శంకర్‌పల్లి ప్రాంత అభివృద్ధికి ప్రజల సహకారంతో మరింత కృషి చేస్తామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్భంగా తెలిపారు.ఈ స్వాగత కార్యక్రమంలో శంకర్‌పల్లి మునిసిపల్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు.
