శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సినీ నటిస్వాతిప్రియ ప్రత్యేక పూజలు
- అలంపూర్లో ఘనంగా స్వేరోస్ డే - October 22, 2026
- కాలం మారినా.. తరాలు మారినా.. పండుగ సాయన్న కీర్తి చిరస్థాయే!:చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
- October 22, 2026 - పండగల సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ బొల్లారం వెంకట్రెడ్డి - October 22, 2026

శంకర్పల్లి: అక్టోబర్ 27: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ నటి, మోడల్ స్వాతిప్రియ (మాస్ చిత్రం) స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. కార్తీకమాసం మొదటి సోమవారం శివలింగానికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నారని స్వాతిప్రియ అన్నారు. అనంతరం ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్ రెడ్డి ఆమెను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ జనరల్ సెక్రెటరీ జనార్ధన్, సభ్యుడు హనుమంతు, అర్చకుడు ప్రమోద్ ఉన్నారు.
