అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి
- వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది.. - September 24, 2026
- అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి - September 24, 2026
- కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు.. - September 24, 2026
అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి
త్వరితగతిన సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
కట్టంగూర్: మండల కేంద్రంలోని అంబటి వాగు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని గురువారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. 359 సర్వే నంబర్‌లో 5.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా దేశ రామాచారి తనకు 30 సంవత్సరాల క్రితం 30 గుంటల భూమికి లావణి పట్టా ఉందని, తనకు పట్టా మంజూరు చేయాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి, సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ భూమిని త్వరితగతిన సర్వే చేసి, హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమి విస్తీర్ణం, హద్దులు, రికార్డుల వివరాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ పుష్పలత, ఆర్ఐలు రామారావు, సత్యనారాయణ, సత్యనారాయణ, సర్వేయర్ మధు తదితరులు ఉన్నారు.
