నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ సెలెక్షన్స్ – క్రీడాకారులకు పిలుపు
- కల్వకుర్తిలో వినాయక మండపాలలో గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు - September 24, 2026
- నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ సెలెక్షన్స్ – క్రీడాకారులకు పిలుపు - September 24, 2026
- లింగారెడ్డిపల్లి లో ఇంటింటికీ రెండు మొక్కల పంపిణీ - September 24, 2026
కల్వకుర్తి : 
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) ఆధ్వర్యంలో జరగనున్న 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ – 2026 (NIDJAM) కు నాగర్ కర్నూల్ జిల్లా నుండి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.
జిల్లా స్థాయి సెలెక్షన్స్ వివరాలు:
తేదీ: 29-09-2026, ఉదయం 8 గంటలకు
వేదిక: తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాల, జయప్రకాశ్ నగర్ మైదానం, కల్వకుర్తి.ఈ సెలెక్షన్స్ ను నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం. విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలాపోగుల స్వాములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వయోపరిమితి:
• U-14: 17-11-2012 నుండి 16-11-2014 మధ్య జన్మించిన వారు • U-16: 17-11-2010 నుండి 16-11-2012 మధ్య జన్మించిన వారు
U-14 విభాగంలో గరిష్టంగా 4 మంది (బాలురు, బాలికలు కలిపి), U-16 లో ఒక ఈవెంట్ కు గరిష్టంగా ఇద్దరిని ఎంపిక చేస్తారు. క్రీడాకారులు తమ బర్త్ సర్టిఫికేట్ తో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.జాతీయ స్థాయి పోటీలు నవంబర్ 14 నుండి 16 వరకు తెలంగాణలోని ఫోక్స్ యూనివర్సిటీలో జరుగుతాయని తెలిపారు.
సంప్రదించాల్సిన నంబర్: 9866469054
