నాగర్‌కర్నూల్ దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే SRD నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు
- నాగర్‌కర్నూల్ దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే SRD నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు - November 2, 2026
- తలకొండపల్లిని కరువు మండలంగా ప్రకటించండి – బీఆర్ఎస్ డిమాండ్ - October 30, 2026
- మాడుగులలో సుంకిరెడ్డి 26వ జాబ్ డ్రైవ్ కు విశేష స్పందన - October 28, 2026

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన రోస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడింది.
ఈ వెరిఫికేషన్ కార్యక్రమంలో ఉదయ్ (UDAY) అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం. శ్రీనివాసులు గారు మరియు నాగర్‌కర్నూల్ జిల్లా ఉదయ్ బృందం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రోస్టర్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులతో సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ గారు దివ్యాంగుల ఉద్యోగాల భర్తీకి చూపుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు. రోస్టర్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో త్వరలోనే జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక నియామకాల (SRD) నోటిఫికేషన్ వెలువడనుందని, ఇది జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఉదయ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
