కల్వకుర్తిలో వినాయక మండపాలలో గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.1001339568.jpg

ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగులు నాయక్, కౌన్సిలర్ రామ్ నాయక్, మాజీ కౌన్సిలర్ తాహిర్ అలీ, మాజీ సర్పంచ్ అంజి నాయక్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

You may also like...