మృతుడి కుటుంబానికి అండగా గోలి శ్రీనివాస్ రెడ్డి.. రూ.5 వేల ఆర్థిక సాయం
- మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ! - November 14, 2026
- పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.! - November 14, 2026
- పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు.. గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - November 14, 2026

కల్వకుర్తి,నవంబర్ 14: కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎండీ. అమీనొద్దిన్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత అందించారు.అమీనొద్దిన్ మృతి విషయం బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్యపడవద్దని, కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మైబు యాదవ్, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లయ్య, రమేష్, అనిల్, జంగయ్య, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
