లింగారెడ్డిపల్లిలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం
- కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం - September 29, 2026
- లింగారెడ్డిపల్లిలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం - September 29, 2026
- కల్వకుర్తి నియోజకవర్గంలో వైద్య విద్యార్థులకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక భరోసా - September 28, 2026
వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి
గ్రామ శివారులో భూములు కలిగిన పట్టాదారులకు గ్రామ పంచాయతీ ఆవరణలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి కవిత ఆధ్వర్యంలో ఈ నమోదు ప్రక్రియ చేపట్టారు.రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన, పంట ఉత్పత్తి కొనుగోలు, అమ్మకం, ఎరువులు, విత్తనాలపై అర్హత, సబ్సిడీ తదితర ప్రయోజనాలు లభిస్తాయని, నమోదు చేసుకోకపోతే అన్ని అర్హతలు కోల్పోతారని అధికారులు స్పష్టం చేశారు.
రైతు నమోదుకు కావలసినవి:
1) ఆధార్ కార్డు
2) ఆధార్ కు అనుసంధానం చేసిన ఫోన్
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి కవిత, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, మేట్ మల్లేపాకుల భాస్కర్, యువకులు జోగు ప్రశాంత్, కొమ్ము జంగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
