గ్రామీణ తపాలా జీవిత బీమాతో పేదలకు ఎంతో మేలు
- కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన - September 6, 2026
- ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి - September 6, 2026
- వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 6, 2026
వెల్దండ సెప్టెంబర్ 05: గ్రామీణ తపాల జీవిత భీమా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని పోస్ట్ మాస్టర్ పుష్పగిరి రావు అన్నారు.వెల్దండ మండల కేంద్రంలో శనివారం జీవిత బీమా గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ గ్రామీణ తపాల జీవిత భీమా చేసుకోవడానికి 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల గల వ్యక్తులు రూ.1000 నుండి 10 లక్షల వరకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని,ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ చందర్ రావు, రాజేందర్ రెడ్డి,దామర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.
