వెంకటాపూర్ లో ఘనంగా బీజేపీ దిమ్మె ఆవిష్కరణ

కల్వకుర్తి: కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలో బీజేపీ దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు హాజరై బీజేపీ దిమ్మెను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తల్లోజు ఆచారి మాట్లాడుతూ గ్రామస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1001341560.jpg

You may also like...