పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రజాపాలన లక్ష్యం – ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు

1001342190.jpg

వెల్దండ, నవంబర్ 08: వెల్దండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు కొండ్ర లక్ష్మమ్మ నివాసంలో ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంయుక్తంగా దీపావళి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. లబ్ధిదారులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ సింగిల్ విండో చైర్మన్ వై. భూపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఆర్యవైశ్య జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్,సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, మండల మైనారిటీ నాయకుడు రషీద్, వార్డు సభ్యులు కొండల్, మల్లీశ్వరి, కిష్టల్, రాజు, వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్, శ్రీనివాస్, కొండల్, నాగార్జున, అఫ్రోజ్, ఇతర స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...