అవగాహనతోనే భద్రతకు తొలి అడుగు.. షీ టీమ్స్

 ఉప్పల్,  విద్యార్థినులు, మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉప్పల్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీ టీమ్స్ పనితీరు, వాస్తవ ఘటనల ఆధారంగా కేస్ స్టడీలు, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, సీడీఈడబ్ల్యూ కౌన్సెలింగ్ కేంద్రాల సేవలు, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వం, సీసీటీవీ ప్రాముఖ్యతపై వివరించారు….