భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహణకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్, IAS, మీకాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీని సందర్శించి సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీతో పాటు సమ్మిట్ వేదిక వద్ద…
