హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టురట్టు..
మల్కాజిగిరి: ఎస్ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 3.180 కిలోల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్ 16న ఐడీఏ నాచారంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థం విలువ సుమారు రూ.40 లక్షలు. మూడు సెల్ఫోన్లు, టీవీఎస్ జూపిటర్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సరఫరాదారు వెంకట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు…
