సాన్‌జోస్‌లో క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో భేటీ


సాన్‌జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్‌తో సమావేశమై తదుపరి తరం సాలిడ్‌స్టేట్ బ్యాటరీ సాంకేతికతపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో భవిష్యత్ అవసరాలు, అధునాతన బ్యాటరీల తయారీ సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు అనుగుణంగా బ్యాటరీల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు పరిశీలించాయి. ముఖ్యంగా బ్యాటరీ తయారీలో కీలకమైన ముడి పదార్థాల లభ్యత, సరఫరా గొలుసు, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక భాగస్వామ్యాలపై దృష్టి సారించారు.
తెలంగాణలో ఉన్న క్లీన్‌టెక్ పర్యావరణ వ్యవస్థలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), అధునాతన తయారీ రంగాల్లో క్వాంటమ్‌స్కేప్‌తో ప్రత్యక్ష భాగస్వామ్య అవకాశాలను కూడా పరిశీలించారు. రాష్ట్రంలో కొత్త సాంకేతికతలకు ప్రోత్సాహం కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ఈ చర్చలు సాగాయి.
సాలిడ్‌స్టేట్ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత, మెరుగైన భద్రత, వేగవంతమైన ఛార్జింగ్ వంటి ప్రయోజనాలను అందించే అవకాశముండటంతో భవిష్యత్ ఈవీ రంగంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్వాంటమ్‌స్కేప్‌తో సాంకేతిక, పరిశోధన, తయారీ భాగస్వామ్యాలపై జరిగిన చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది

You may also like...