బాక్సాఫీస్ తర్వాత బిజినెస్‌పైనా ఎన్టీఆర్ దూకుడు..!
- హైదరాబాద్‌లో భారీ వర్షం.. - August 2, 2026
- ప్రజల విశ్వాసానికి నిలువెత్తు చిరునామా…సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.. - August 2, 2026
- 10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్’కు శ్రీకారం - August 2, 2026

గచ్చిబౌలిలో లగ్జరీ మల్టీప్లెక్స్‌కు రంగం సిద్ధం చేస్తున్న యంగ్ టైగర్?
హైదరాబాద్: వెండితెరపై తన ఆధిపత్యాన్ని చాటుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు థియేటర్ వ్యాపార రంగంలోనూ తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సాగుతున్నాయన్న వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టి తమ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ కూడా అదే బాటలో అడుగులు వేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. సినిమా రంగంలో నటుడిగానే కాదు, వ్యాపారవేత్తగానూ తన సత్తా చాటేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గచ్చిబౌలి వంటి ఐటీ కేంద్రంలో భారీ పెట్టుబడితో మల్టీప్లెక్స్ ఏర్పాటు జరిగితే, సినీ వినోద రంగంలో పోటీ మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీకి ఇప్పుడు థియేటర్ వ్యాపార పోటీ కూడా జతకానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
