26న పింఛన్ల జాతర!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్:

రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్‌ 26న మొత్తం 4,63,857 మందికి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 4.50 లక్షల కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. గతంలో మంజూరైన 1,23,625 పింఛన్లతో కలిపి కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేరిన వారి సంఖ్య 5,73,625కు చేరింది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూత పింఛన్లు ఎంతో ఆసరాగా నిలవనున్నాయి. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అర్హులందరికీ పింఛన్‌ సొమ్ము సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. మంజూరు పత్రాలు అందడమే కాకుండా ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందేలా చూడటం కీలకంగా మారింది.

You may also like...