పార్టీ కోసం శ్రమించిన భాస్కర్ రెడ్డికి మార్కెట్ చైర్మెన్ – ఇమ్రాన్ బాబా

1001373267.jpg

ఆమనగల్ నవంబర్ 18 : ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్ రెడ్డికి కేటాయించాలని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ బాబా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గూడూరు భాస్కర్ రెడ్డి ఎంతో శ్రమించారని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆమనగల్ మండల ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పార్టీ శ్రేణులతో కలుపుగోలుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారని తెలిపారు.పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులకు పదవుల్లో సముచిత గుర్తింపు కల్పించడం ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని ఇమ్రాన్ బాబా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గూడూరు భాస్కర్ రెడ్డికి ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

You may also like...