రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) జగద్గిరిగుట్టలో 2015లో జరిగిన మెదిది ఆనంద్ కుమార్ (23) హత్య కేసులో నిందితులు నితాయ్ రాకేష్, షేక్ బాబర్ జానీలకు కూకట్పల్లి III అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వరరావు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. ఈ కేసులో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కుశాల్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.వి.కె. రామకృష్ణ, డి. ఉపేందర్ కీలకంగా వ్యవహరించారు. ఈ వివరాలను సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) ఆఫీస్ ప్రెస్‌నోట్ ద్వారా వెల్లడించారు.